Politics
ભેજ-પરસેવાથીલોકોની મુશ્કેલી વધી:પોરબંદર-જૂનાગઢ રૂટની બસમાં કંડક્ટરની દાદાગીરી સામે મુસાફરોમાં ભારે રોષ
August 26, 2026
2,743 views
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసలపై కఠిన వైఖరి అవలంబించడంతో బిఎస్ఎఫ్ సైన్యం పహారా పెరిగింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా బలవంతపు పంపింపులు జరుగుతు న్నాయని ఆరోపిస్తోంది. ఈ పరస్పర ఉద్రిక్తతల మధ్య సాధారణ ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాల మధ్య మానవత్వం, సరిహద్దు వద్ద చిక్కుకుపోయిన కుటుంబాల్లో చాలామంది తమ గ్రామాలకు వెళ్లాలని వేడుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి. చిన్నపిల్లలు వర్షంలో నిలబడటం, మహిళలు నేలపైనే గంటల తరబడి ఉండటం, వృద్ధులు భయంతో వణికిపోవడం... ఓ మహిళ నేను ఖుల్నా నుంచి వచ్చాను.. మా గ్రామానికి వెళ్లాలి అంటూ వేడుకోవడం కనిపించింది. పశ్చిమబెంగాల్లోని కూచ్బీహార్ జిల్లా పానీశాల సరిహద్దు వద్ద ఇప్పుడు కేవలం కంచెలు మాత్రమే లేవు. అక్కడ భయం ఉంది. అనిశ్చితి ఉంది. ఎవరూ అంగీకరించని మనుషుల నిశ్శబ్ద వేదన ఉంది. గత కొన్ని రోజులుగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం భద్రతా సమస్యగా కాకుండా మానవ సంక్షోభంగా మారుతున్నాయి. ముఖ్యంగా కూచ్ బీహార్లోని పానీశాల వద్ద మహిళలు, పిల్లలు సహా పలువురు జీరో లైన్లో చిక్కుకుపోయిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. భారత బిఎస్ఎఫ్ వారిని బంగ్లాదేశ్ వైపు పంపించడానికి ప్రయత్నించిందని, అయితే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ కూడా వారిని స్వీకరించడానికి నిరాకరించిందని వార్తలు వెలువడ్డాయి. దీంతో కుటుంబాలు గంటల తరబడి సరిహద్దు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ పరిస్థితికి కారణాలేమిటి? భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భూసరిహద్దుల్లో ఒకటి. సుమారు 4,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ సరిహద్దు నదులు, గ్రామాలు, అడవులు, పొలాల మధ్యుగా సాగుతుంది. ఎన్నో ప్రాంతాల్లో కంచెలు పూర్తిగా లేవు. దీంతో దశాబ్దాలుగా అక్రమ వలసలు, స్మగ్లింగ్, గుర్తింపు సమస్యలు కొనసాగుతున్నాయి. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత భారీ స్థాయిలో వలసలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, వరదలు, ఉపాధి కొరత కారణంగా చాలామంది భారత సరిహద్దు రాష్ట్రాలకు వలస వచ్చారని అధికార అంచనాలు చెబుతున్నాయి. పశ్చిమబెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసల అంశం రాజకీయంగా కూడా పెద్ద చర్చగా మారింది. పౌరసత్వం, ఓటర్ల జాబితాలు, సరిహద్దు భద్రత వంటి అంశాలు ఎన్నికల రాజకీయాల్లో కీలకంగా మారాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసలపై కఠిన వైఖరి అవలంబించడంతో బిఎస్ఎఫ్ సైన్యం పహారా పెరిగింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా బలవంతపు పంపింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. ఈ పరస్పర ఉద్రిక్తతల మధ్య సాధారణ ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాల మధ్య మానవత్వం, సరిహద్దు వద్ద చిక్కుకుపోయిన కుటుంబాల్లో చాలామంది తమ గ్రామాలకు వెళ్లాలని వేడుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి. చిన్నపిల్లలు వర్షంలో నిలబడటం, మహిళలు నేలపైనే గంటల తరబడి ఉండటం, వృద్ధులు భయంతో వణికిపోవడం... ఓ మహిళ నేను ఖుల్నా నుంచి వచ్చాను.. మా గ్రామానికి వెళ్లాలి అంటూ వేడుకోవడం కనిపించింది. ఆ దృశ్యం ఇప్పుడు సరిహద్దు రాజకీయాల కంటే పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇవన్నీ సరిహద్దు రాజకీయాల వెనుక దాగిపోయిన మానవ విషాదాన్ని చూపిస్తున్నాయి. ఒక దేశం వాళ్లు మా వారు కాదు అంటుంటే.. మరో దేశం మేము స్వీకరించం అంటోంది. ఆ మధ్యలో నిలిచిపోయింది మాత్రం మనుషుల జీవితం. భారత్, బంగ్లాదేశ్ రెండూ తమ భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అదే సమయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సూత్రాల ప్రకారం మహిళలు, పిల్లలు, వృద్ధులకు కనీస రక్షణ కల్పించడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. కూచ్ బీహార్ చెబుతున్న హెచ్చరిక కూచ్బీహార్లో కనిపిస్తున్న దృశ్యాలు ఒక హెచ్చరికలా ఉన్నాయి. సరిహద్దుల్ని కంచెలతో మూసేయవచ్చు. కానీ ఆకలి, పేదరికం, నిరాశను కంచెలతో ఆపలేరు. రాజకీయాలు వారెవరు? అని ప్రశ్నిస్తుంటే.. మానవత్వం మాత్రం వాళ్లు కూడా మనుషులే అని గుర్తుచేస్తోంది. పానీశాల వద్ద నిలిచిపోయిన ఆ పిల్లల కళ్లలో కనిపిస్తున్న భయం, అది ఒక్క కుటుంబానిదే కాదు. - మధుగౌడ్. జి 95335 51188