Politics

Jana Sena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే

September 6, 2026 1,550 views 1 min read
Jana Sena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే

Jana Sena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే

Jana Sena for AP Local Body Elections | అమరావతి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకులు, జనసైనికులు, వీర మహిళలను సన్నద్ధం చేసేందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు జనసేన సెంట్రల్ ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ కమిటీల నిర్వహణ కోసం ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తతో పాటు ముగ్గురు కమిటీ సభ్యులను నియమించారు. వీరికి సహాయంగా ఉండేందుకు ఆయా లోక్‌సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎంపిక చేసి సహాయక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల కోసం నియమించిన కమిటీ సభ్యులకే ఈ లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ కమిటీలు జనసేన పార్టీ అనుసరించే సిద్ధాంతాలు, విధివిధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, కూటమి పక్షాలతో పూర్తి సమన్వయం కొనసాగించేలా పర్యవేక్షిస్తాయి. ఎంపిక చేసిన సభ్యులందరికీ ఈ నెల 9న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.

జనసేన కోఆర్డినేటర్లు ఎవరంటే

స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతల కోసం నియోజకవర్గాల వారీగా ప్రముఖ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు లోకం నాగమాధవి, అరకుకు కె.రవికుమార్, విశాఖపట్నం, అనకాపల్లిలకు చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు. అలాగే కాకినాడ, రాజమహేంద్రవరం బాధ్యతలను కొటికలపూడి గోవిందరావు (చినబాబు), అమలాపురం, ఏలూరు బాధ్యతలను బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం, మచిలీపట్నం బాధ్యతలను మండలి బుద్ధప్రసాద్‌కు అప్పగించారు.

విజయవాడ, గుంటూరులకు మంత్రి కందుల దుర్గేశ్, బాపట్ల, నరసరావుపేటలకు వల్లభనేని బాలశౌరి, ఒంగోలు, నెల్లూరులకు తమ్మిరెడ్డి శివశంకర్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఇక రాయలసీమ విషయానికి వస్తే నంద్యాలకు యనమల భాస్కర్, కర్నూలు, హిందూపురానికి చిలకం మధుసూదన్‌రెడ్డి, అనంతపురానికి సామినేని ఉదయభాను, కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దేవ వరప్రసాద్, తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలకు పి.ధర్మరాజులు జనసేన కోఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.