Sports

IPL DC Worst Record: ఢిల్లీ బ్యాటర్ల పతనం - ఆర్‌సీబీ పేసర్ల ఊచకోత.. 17 ఏళ్ల రికార్డు బద్ధలు.. చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు

April 27, 2026 3,429 views 1 min read
IPL DC Worst Record: ఢిల్లీ బ్యాటర్ల పతనం - ఆర్‌సీబీ పేసర్ల ఊచకోత.. 17 ఏళ్ల రికార్డు బద్ధలు.. చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు
```html

IPL DC Worst Record: ఢిల్లీ బ్యాటర్ల పతనం - ఆర్‌సీబీ పేసర్ల ఊచకోత.. 17 ఏళ్ల రికార్డు బద్ధలు.. చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు


Delhi Capitals Top Order Creating Lowest Powerplay Record in IPL History: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు సోమవారం రాత్రి సంచలనం సృష్టించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమ‌వారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. ఇది ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో పూర్తి స్థాయి మ్యాచ్‌లలో పవర్‌ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. ఆర్‌సీబీ బౌలర్లు ఇద్దరూ తలో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించారు.



భువీ షురూ.. హేజిల్‌వుడ్ విధ్వంసం


ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ తన మ్యాజిక్ చూపించాడు. యువ ప్లేయర్ పరాఖ్‌ను అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి ఢిల్లీ పతనానికి పునాది వేశాడు. ఆ తర్వాత ఓవర్లో జోష్ హేజిల్‌వుడ్ రంగంలోకి దిగి పంజాబ్ పై గత మ్యాచ్‌లో 152 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ను అవుట్ చేశాడు. 141.4 కిలోమీటర్ల వేగంతో హేజిల్‌వుడ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన రాహుల్, వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి కేవలం ఒక పరుగుకే వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే సమీర్ రిజ్వీని గోల్డెన్ డక్‌గా అవుట్ చేసి హేజిల్‌వుడ్ ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చినా ట్రిస్టన్ స్టబ్స్ దాన్ని అడ్డుకున్నాడు. కానీ స్టబ్స్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. కేవలం 13 బంతుల వ్యవధిలోనే ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.



రికార్డుల వేటలో ఆర్‌సీబీ బౌలర్లు


ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం భువనేశ్వర్ వేసిన బంతికి ఎడ్జ్ ఇచ్చి అవుటయ్యాడు. కేవలం 2.4 ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 7/5 గా మారింది. ఆ తర్వాత హేజిల్‌వుడ్ తన బౌన్సర్లతో నితీష్ రాణాను ఇబ్బంది పెట్టాడు. అత‌ను వేసిన బౌన్స‌ర్ రాణా బ్యాట్ కు తగిలి నేరుగా స్లిప్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ చేతుల్లోకి వెళ్ళింది. నాలుగో ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్ ముగిసే సమయానికి స్కోరు 13/6 కి చేరుకుంది.



గత రికార్డులు కనుమరుగు


పవర్‌ప్లేలో ఢిల్లీ నమోదు చేసిన ఈ 13/6 స్కోరు సరికొత్త రికార్డు. 2009లో కేప్ టౌన్‌లో ఆర్‌సీబీపై రాజస్థాన్ రాయల్స్ చేసిన 14/2 స్కోరు ఇప్పటివరకు అత్యల్పంగా ఉండేది. ఇప్పుడు ఢిల్లీ ఆ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్కు (14/3), చెన్నై సూపర్ కింగ్స్ (15/2) వంటి జట్లు కూడా తక్కువ స్కోర్లు నమోదు చేసినప్పటికీ, ఢిల్లీ పతనం మాత్రం ఘోరంగా ఉంది. భువనేశ్వర్, హేజిల్‌వుడ్ పక్కా ప్లాన్ తో వేసిన బంతులకు ఢిల్లీ టాప్ ఆర్డర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఐపీఎల్ 2026 లో ఆర్‌సీబీ బౌలర్లు ఫామ్ లోకి రావడం ఆ జట్టు అభిమానులకు పెద్ద ఊరటనిస్తోంది.


```