Sports

Brendan Taylor Breaks Sachin's Record: సచిన్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు బ్రేక్.. వన్డేల్లో చరిత్ర సృష్టించిన టేలర్

September 15, 2026 919 views 2 min read
Brendan Taylor Breaks Sachin's Record: సచిన్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు బ్రేక్.. వన్డేల్లో చరిత్ర సృష్టించిన టేలర్

Brendan Taylor Breaks Sachin&039;s Record: సచిన్ ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు బ్రేక్.. వన్డేల్లో చరిత్ర సృష్టించిన టేలర్

Brendan Taylor Overtakes Legendary Sachin Tendulkar In Longevity: పురుషుల అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కెరీర్ కలిగిన ఆటగాడిగా జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డును అతడు అధిగమించాడు. హరారే వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో బరిలోకి దిగడం ద్వారా టేలర్ ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం టేలర్ వన్డే కెరీర్ కాల వ్యవధి 22 ఏళ్ల 148 రోజులకు చేరుకుంది. దీంతో సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన 22 ఏళ్ల 91 రోజుల రికార్డు రెండో స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య 21 ఏళ్ల 184 రోజుల కెరీర్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. అత్యధిక పరుగులు (18,426), అత్యధిక మ్యాచ్‌లు (463) ఆడిన రికార్డులు మాత్రం ఇప్పటికీ సచిన్ పేరిటే పదిలంగా కొనసాగుతున్నాయి.

Brendan Taylor has broken Sachin Tendulkar&039;s long-standing record for the longest career in Men&039;s ODIs, now at 22 years and 148 days.

22y 148d - Brendan Taylor
22y 91d - Sachin Tendulkar
21y 184d - Sanath Jayasuriya
20y 272d - Javed Miandad pic.twitter.com/RVtxPOio63
— Abdul Rehman Yaseen (@Aryaseen5911) September 15, 2026

2004లో అరంగేట్రం..
40 ఏళ్ల బ్రెండన్ టేలర్ 2004 ఏప్రిల్ నెలలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టాడు. అనతికాలంలోనే జింబాబ్వే జట్టులో ప్రధాన బ్యాటర్‌గా ఎదిగాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు వరకు అతడు 207 వన్డేల్లో 6,704 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు ఉన్నాయి. జింబాబ్వే క్రికెట్ చరిత్రలోనే ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక వన్డే శతకాల రికార్డు టేలర్ పేరిటే ఉండటం విశేషం.

Read Also: Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు

ఫిక్సింగ్ వివాదం.. మూడున్నరేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం
2021లో టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే నాలుగు నెలల తర్వాత, 2022 జనవరిలో అతడు చేసిన సంచలన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేశాయి. 2019లో కొందరు వ్యక్తులు తనను కొకైన్ మత్తులో ముంచి మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలంటూ బ్లాక్‌మెయిల్ చేశారని వెల్లడించాడు. తాను ఎలాంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేసినప్పటికీ, తన కుటుంబ రక్షణ కోసం భయపడి ఐసీసీకి సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేశానని అంగీకరించాడు. దీంతో నిబంధనల ఉల్లంఘన కింద ఐసీసీ అతడిపై మూడున్నర సంవత్సరాల పాటు అన్ని రకాల క్రికెట్ నుంచి నిషేధం విధించింది.

2027 ప్రపంచకప్ లక్ష్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని ఎంట్రీ
శిక్షా కాలం ముగిసిన తర్వాత టేలర్ 2025లో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే, పొరుగు దేశాలైన సౌతాఫ్రికా, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2027 వన్డే ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేయడంలో భాగంగా టేలర్ అనుభవాన్ని జింబాబ్వే బోర్డు కీలకంగా భావిస్తోంది. మైదానంలోకి అడుగుపెడుతూనే ఈ దిగ్గజ ప్లేయర్ సచిన్ రికార్డును సైతం చెరిపేశాడు.